![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -829 లో...... రాజ్ దగ్గరకి కళ్యాణ్ వచ్చి నీతో మాట్లాడాలి అన్నయ్య బయటకు వెళదామని అంటాడు. ఇద్దరు బయటకు వెళ్తుంటే.. కావ్య వస్తుంది. ఎక్కడకి వెళ్తున్నారు.. ఈ టైమ్ లో అని అడుగుతుంది. కళ్యాణ్ ఏదో మాట్లాడాలట అని రాజ్ అనగానే అంత సీక్రెట్ ఏముంటుందో కొంపదీసి వేరొక అమ్మాయిని సెట్ చేసుకొని ట్విస్ట్ ఇవ్వడం లేదు కదా అని కావ్య అంటుంది.
ఆ తర్వాత కళ్యాణ్, రాజ్ ఇద్దరు బయటకు వెళ్తారు. అన్నయ్య అప్పు నేను హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు.. అప్పుకి ఏదో ప్రాబ్లమ్ ఉందట బేబీని క్యారీ చెయ్యకూడదంట ఒకవేళ చేస్తే అప్పు ప్రాణానికి ప్రమాదమంట అని చెప్పగానే రాజ్ షాక్ అవుతాడు. వెంటనే అప్పుకి చెప్పు ఎంత త్వరగా వీలైంత అంత త్వరగా డాక్టర్ చెప్పినట్టు చెయ్యాలని రాజ్ అంటాడు. అప్పు ని ఒప్పించాలని రాజ్ అనగానే అయితే నువ్వే ఒప్పించు అన్నయ్య.. ఏం అంటున్నావని రాజ్ అనగానే.. అవును అన్నయ్య వదినని ఒప్పించాల్సింది నువ్వే ప్రాబ్లమ్ ఉంది.. అప్పుకి కాదు వదిన కి అని కళ్యాణ్ జరిగిందంతా రాజ్ కి చెప్పగానే షాక్ అవుతాడు. మాట్లాడాలని చెప్పి శిక్ష వేసావ్ ఏంట్రా అని రాజ్ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత స్వరాజ్ తో అపర్ణ, ఇందిరాదేవి, కావ్య మాట్లాడతారు. నాకు బుల్లి మరదలిని ఇవ్వమని స్వరాజ్ అంటుంటే అందరు నవ్వుకుంటారు.
అప్పుడే రాజ్, కళ్యాణ్ డల్ గా వేస్తారు. ఎక్కడికి వెళ్లారని అపర్ణ అడుగుతుంది. ఈ మధ్య అన్నదమ్ములకి రహస్యాలు ఎక్కువ అయ్యాయని కావ్య అంటుంది. ఆ తర్వాత రాజ్ దేవుడు విగ్రహం దగ్గరికి వెళ్లి బాధపడతాడు. నువ్వు వాళ్ళ తల తలరాత ఎలా రాసావో తెలియదు కానీ నేను నా భార్య బిడ్డని కాపాడుకుంటానని రాజ్ అంటాడు. మరొకవైపు కళ్యాణ్ రాగానే బావకి చెప్పావా అని అడుగుతుంది. తరువాయి భాగంలో నిద్రపోతున్న కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి.. నిన్ను నా బిడ్డని నేను కాపాడుకుంటానని అంటాడుమ రాజ్ వెళ్ళిపోతుంటే కావ్య చెయ్ పట్టుకుంటుంది. అంత వినేసిందా అని రాజ్ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |